పది లక్షలు అప్పుగా ఇస్తామంటే మీరేం చేస్తారు?

పది లక్షలు అప్పుగా ఇస్తామంటే మీరేం చేస్తారు?

1).. బ్యాంక్ వడ్డితో మీ చేతిలో తక్షణం ఒ పది లక్షలు, లేదా యాబై లక్షలు    ఏం వ్యాపారం చేసి తమ జీవితాన్ని నడుపుకోంటారని ప్రపంచంలోని అందరిని ప్రశ్చించి చూస్తే…ధాంట్లో సహజంగా నూటికి 60 శాతం మంది తమకు ఏ డబ్బు అప్పుగా వద్దు ఎక్కడైనా హాయిగా జాబ్ చేసుకుని జీవనోఫాధి చూసుకుంటాం అంటారు..

2) అప్పు గా తీసుకున్న 40 శాతం మందిలో 10 శాతం మంది  ఉత్పత్తి ప్ర్రక్రియలో పెట్టుబడి పెడుతారు.

అంటే సోప్ అమ్మే షాపు కాకుండా సోపు తయారు చేయడం, ఫీనాయిల్ అమ్మే షాపు కాకుండా ఫీనాయిల్ తయారి ఇలా…..వీరిల్లో నూటికి 70 శాతం మంది మొదటి ఏడాదిలో ఫేయిల్ అయి దాని నుండి విరమించుకుంటారు.. కారణం ప్రపంచంలో దేన్నైనా ఉత్పత్తి చేయడం తేలికే , దాన్ని అమ్మడం లోనే అసలు సమస్య అంతా ఉంది కాబట్టి. తాము ఉత్పత్తి చేసిన దాన్ని సరిగా అమ్మలేరు కాబట్టి ఈ ఫేయిల్యూర్…ఈ పదిశాతంలో 0.001 శాతం మెగా సక్సెస్ (ధీరు బాయి అంబానీలాగ) అవుతారు, 1 శాతం మంది సూపర్ సక్సెస్ అవుతారు. 10శాతం మంది లాభాలాతో కంటిన్యూ అవుతారు..మరో 19శాతం మంది ఇతర ఉత్పత్తులను క్లబ్ చేసి సోసో గా నడిసిస్తుంటారు.

3 ) అప్పు గా తీసుకున్న వారిలో మరో 40 శాతం మంది ఏ ఉత్పత్తి తలనొప్పికి పోకుండా సేల్స్ (షాపు, మద్య వర్తిత్వం) జోలికి వెళుతారు… షాపు పెట్టడం అంటే ఎక్కువ పెట్టుబడికి సంభందించింది , దీర్ఘకాలంగా ఉంటుంది కాబట్టి , దీంట్లో నూటికి 70 శాతం సక్సెస్ రేట్ ఉంటంది…మిగితా 30 శాతం నష్టఫోయే షాపులు  ప్రక్రుతి నియమాల తప్పని సరిగా ప్రకారం ఉండే ఉంటాయి.

4) మరో 40 శాతం మంది సర్వీసు, మార్కెటింగ్ రంగాల మీద పెట్టుబడి పెడుతారు. ఇవి భౌతికమైనవి  కాకపోవడంతో ఇక్కడ సక్సెస్ రేటు 50 : 50 శాతం మాత్రమే….

విజయం పొందవచ్చు, అపజయం  పొందవచ్చు… ఏదైనా జరుగవచ్చు.

5)  మరో 10 శాతం స్పెక్యూలేషన్ బిజినెస్ లలో పెట్టుబడి పెడుతారు.. షేర్ మార్కెట్స్  డే ట్రేడింగ్ ( నాట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేడింగ్)  ,సినిమా, గాంబ్లింగ్, హర్స్ రైడింగ్, బెట్టింగ్, పేకాట, మొదలైనవి..

వీటిల్లో సక్సెస్ రేటు 10 శాతం, ఫేయిల్యూర్ రేటు 90 శాతం,  Your Profits is all ways Proportionate to the risk సూత్రం ప్రకారం ఇక్కడ పోయిన ఒక రేంజిలో పోతుంది వచ్చినా ఒక రేంజిలో వస్తుంది…

కాబట్టి….

తక్షణం మీ చేతికి పదిలక్షలో , యాబై లక్షలలో బ్యాంక్ వడ్డికి అప్పుగా మీ కిచ్చి మీరేం చేస్తారని ఎవరని అడిగినా కూడా, డబ్బు అప్పుకు తీసుకుంటామని చెప్పేవారిలో 70  శాతం  మంది సమాధానం  చాల ఖచ్చితంగా ,పలాన పని, పలాన వ్యాపారం చేసి సంపాదిద్దామని…….30 శాతం మందికి ఏ క్లియర్ థాట్ ఉండదు, రివర్స్ మనల్నే అడుగుతారు, ఇప్పుడు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో చెప్పండి అదే చేస్తామని….

70 శాతం మంది ఖచ్చితంగా  చెప్పే సమాదానంలో, అలా చెప్పేవారికి ఏ జ్యోతిష్యం , హస్త్ర సాముద్రికం అవసరంలేదు.. అది వారి ఇన్నర్ సోల్ , ఇన్నర్ ఇంట్యూషన్ నుండి వచ్చే సమాధానాలు కాబట్టి…

కాని ఈ 70 శాతం మందిలో నిజంగా సక్సెస్ రేటు అంతిమంగా 35 శాతమే..  కారణం వెరి సింపుల్..ఒక రైతు ఎంతో బలంగా నమ్మి పంటలు పండుతాయిని అప్పులు తెచ్చే పంట పండిస్తాడు.. మధ్యలో పురుగులు, వానలు, కరువు ఇలా ఎన్నో వచ్చి పంట పండక పోవచ్చు…పంట పండక పోగా అప్పు మీద పడుతుంది..

ఈ పని రైతులు చేస్తే  సాను బూతి చూపి  పాపం రైతన్న అంటారు… అదే పని ఇతర ఫీల్డుల్లో చేసి ఫేయిల్ అయితే , వాడికి తిన్నది అరుగక  ఆ పని చేసాడు, అప్పుల పాలైయ్యాడు అంటారు.అంతే తేడా.. రైతుకు కనీసం పంట లోన్ మీద రి షెడ్యూలింగ్ ఉంటుంది, ఈ సంవత్సరం కట్టకుంటే వచ్చే సంవత్సరం కట్టు , లేదంటే ఆ వచ్చే సంవత్సరం కట్టు అని, ఇతర ఫీల్డుల్లో    అది మిస్ అవుతుంది…..

………..కాబట్టి,

ఒక సంవత్సరం , రెండేళ్ళు , ఏదేండ్లు పంట పోయిన జీవితాంతాం అలాగే ఉండదుగా , ఏదో ఒక రోజు రైతు కైనా , ఇతరులకైనా  టైం  తిరిగి వస్తుంది. తిరిగి నిలబడుతారు…ఇది ఏడాదికో, పదేళ్ళకో సంబందించి కాకుండా జీవితం మొత్తానికి సంబధించింది.

……….. కాబట్టి…..

మేము అప్పు తీసుకుని ఏదైనా ఒక పని చేసి దాన్నుండి రూపాయి సంపాదిస్తామనే మనిషి అంతర్ లోతుల నుండి  పరిపూర్ణ అత్మ విశ్వాసంతో వచ్చే అంతర్ వాణి మాట ఖచ్చితంగా తిరుగులేనిది… దానికి  తిరుగు లేదు ….

………… కాని……….

1) ఒక విషయం పట్ల ఉండే ఇష్టం, మక్కువతో ఆ పని చేసేవారు ఒక కేటగిరి.

2 ) ఆ పని చేయడంలో ఆ వ్యక్తికి ఉండే నైపుణ్య స్థాయితో చేసేవారు రెండవ కేటగిరి. ఈ రెండింటి మద్యన ఖచ్చిత మైన విభజన  చేసుకోకపోవడంతోటే సమస్య అంతా వస్తుంది…ఫేయిల్యూర్స్ అన్ని ఈ రెండవ కేటగిరి నుండే వస్తాయి.

ఆత్మ విశ్వాసం , పట్టుదల ,మొక్కవోని పోరాటం పై రెండు కేటగిరీలవారు సరిసమానంగా వాడిన కూడా అంతిమ విజయం,

డబ్బు సంపాదన మాత్రం నైపుణ్యంతో చేసేవారికే దక్కుతుంది. మొదటి కేటగిరి వారికి డబ్బు విజయంతో సంబందంలేని పేరు మాత్రమే వస్తుంది..

……. కాని …..ఇక్కడ ఒకే రూల్ మినహాయింపుగా పనిచేస్తుంది…

జీవితంలో ఫేయిల్యూర్ అన్నది లేనే లేదు..,..ప్రతీది అంతా  నేర్చుకునే ప్రక్రీయే.. అని  ఆథ్యాత్మికం చెపుతుంది.‘‘బల్బ్ ఎలా వెలుగుతుందో అని 1000 సార్లు నేను ప్రయత్నం చేసి, బల్బ్ వెలుగడం కనుక్కోలేదు, 999 సార్లు ఏం చేస్తే బల్బ్ వెలుగదో కనుక్కున్నా… 1 సారి మాత్రమే ఏం చేస్తే బల్బ్ వెలుగుతుందో కనుకున్నా ’’   థామస్ అల్వా ఎడిసన్…. అనే తత్వంతో అపజయాలు, నష్టాలు ఎదురైనా కూడా కొనసాగితే ఒక పనిపట్ల ఇష్టం , మక్కువతో కొనసాగే వారు ఏదో ఒక నాటికి విజయం సాధిస్తారు.కాని వణికించేఅపజయాల పరంపర,ఆర్ధిక నష్టాలను తట్టుకుని నిలబడగలిగితేనే. అపజాయాన్ని   ఇలా అన్వయించుకోగలిగే మానసిక స్థైర్యం మీకుంటే   పర్వాలేదు..

కాకపోతే జ్యోతిష్యం, న్యూమారాలజి, పామిస్ట్రీ   కాని మరోకటి కాని ఏదైనా చెప్పేది ఒక్కటే………………………..

ఈ 35 శాతం ఫేయిల్యూర్ కేటగిరిలో నువ్వెందుకు ఇరుక్కు పోతావు???? నీకు సరైనా రంగమే ఎంచుకోవడానికి ఈ శాస్ర్తాల్లో మార్గం ఉంది, వాటి మాట పెడచెవిన పెట్టడం ఎందుకు , నీకు సరిపోలే రంగమే వీటి ద్వారా  ఎంచుకుని దాంతోనే ప్రొసీడ్ కావచ్చు కదా అని…కాని,జ్యోతిష్యంలో ఒక సూత్రం ఉంది.. జాతకుడు తన జాతకాన్ని తానంతట తాను తెలుసుకుందామని జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చిన రోజున తప్ప , అతనికి అతని స్నేహితులు కాని, బందువులు కాని ప్రోద్బలం చేయరాదని. కమర్షియల్ గా డబ్బు సంపాదించే జ్యోతిష్యుడు కాకుండా, లోకోద్దారణ, మనిషికి నిజంగా సహాయం చేసి బాగు పర్చాలనే జ్యోతిష్యుడు , దాంట్లో అపార మైన అనుభవం,పాండిత్యం ఉన్న  జ్యోతిష్యుడు మీకు దొరికినప్పడు మీ జాతకాన్ని చూపించుకోవడంతో మేలే జరుగుతుంది. బర్త్ డేట్ లేనివారు హస్ర్త సాముద్రికున్ని ప్రోసీడ్ కావచ్చు.