ఆధ్యాత్మిక సంస్థలు- నిజా నిజాలు 0

ఆధ్యాత్మిక సంస్థలు- నిజా నిజాలు
1) నూటికి  99 శాతం సంస్థలు , భక్తులు, ఫాలోవర్స్ ఇచ్చే చందాల మీద నడిచేవే..
2.) మనిషికి వచ్చే రోగం ,నొప్పులు,మానసిక, ఆర్ధిక భాధలలకు అయా రంగాల్లో డబ్బులు తీసుకుని ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్స్, జ్యోతిష్యుల, మానసికి రోగ నిపుణులు ఉన్నారు.
3. ) వీటన్నింటికి మించింది ఆధ్మాత్మిక భయం.. మనం ఎక్కడి నుండి వచ్చామా, చచ్చాక ఎక్కడికి పోతున్నామో, జీవితానికి అర్ధం ఏమిటో అర్థం కాని సమస్యలతో  మిడిల్ క్లాసువారు బాధపడుతుంటారు.. బాగా డబ్బున్న వారికి , బాగా పేదవారికి వీటితో పని ఉండదు,వీటి అవసరం రాదు… మిడిల్ క్లాసువారు జీవితంలో ఏదో ఒక జీవిత సంఘటనతో నాకు ఇలా ఎందుకు జరిగింది , జరుగుతుంది అనే అన్వేషణలోనే ఈ ఆధ్యాత్మిక సంస్థల దగ్గరకు చేరుకుంటారు.
4) వీటిల్లో నిజమైన Soul Knowledge భోధించేవి 10శాతం ఉన్నాయి.. నిజమైన సోల్ నాలెడ్జి భోదించేవి సంస్థలు సహజంగానే శివాలయాల లాంటివి.. ఏ శివాలయం చూసిన సహజంగా శివుడికి ప్రతిరూపంలా పేదరికంతోనే ఉంటాయి..ఇలాంటి సంస్థలు నిజంగా ఉన్నాయి.కాని ఇవి శివాలయాలాంటివే..పేదరికంతోనే ఉంటాయి.
5) 90శాతం సంస్థలు, ఉపనిషత్తులు,గీతలో ఉన్న ప్రామాణిక అంశాలను తీసుకుని,ఒక నయా భోధకుడి అవతారంతో అవే ప్రాధమిక అంశాలను అటు ఇటూగా మార్చి చెప్పి ,వారి దగ్గరకు వచ్చేవారిని  లేని అయోమయంలోకి నెట్టి , బూమిమీద జీవితం కాకుండా, ఏదో చేస్తే, ఇంకేదో అయితే మరేదో అధ్భుత జీవితం ఉందనే అందమైన ఊహాలోకాల్లోకి మనసును క్రమేణా ఉసిగొల్పి , వారిని నమ్మి వచ్చిన భక్తులు ఫాలోవర్స్ దగ్గరే చందాల రూపేణా డబ్బులు తీసుకోవడం మొదలుపెడుతాయి.
        రోగం నొప్పికి డాక్టర్ తీసుకునే ఫీజుకు లెక్క ఉంటుంది. కాని అగమ్య గోచర విషయాలు చెప్పడం ద్వారా భక్తులు సమకూర్చే నిధులకు అడ్డు అదుపు ఉండదు..డొనేషన్ల రూపంలో అపారమైన డబ్బు ఇక్కడ సమకూరుతుంది.. పదార్థ దర్మం ప్రకాం ఎక్కడ మాస్ ఎక్కువైతే అక్కడ ద్రవ్యరాశి పెరగుతుంది..నానాటికి భక్తుల,సంస్థ పెరుగుతుంది. క్రమంగా అదొక సామాజిక ప్యాషన్ కింద మారినప్పుడు అవి విష్ణు ఆలాయల మాదిరిగా అపార సంపధతో కలకల లాడడం మొదలవువుతుంది.. విష్ణు అలయాలను చూడాలంటే తిరుమల, శ్రీరంగం……
విడిగా  ఏ ఆధ్యాత్మిక సంస్థల పేర్లు రాయదలుచుకోలేదు..మీ ఊహకు అందుతాయి..