గరుడవేగ సినిమా సమీక్ష

గరుడవేగ సినిమా ప్రిడిక్షన్ హిట్టా పట్టా న్యూస్ మీకు ఈ పాటికే వచ్చి ఉంటుంది. జ్యోతిష్యం బేస్ డ్ గా ఈ సినిమా  ఎందుకు హిట్ అయ్యింది అంటే.. చీమ చీమ ఎందుకు కుట్టావ్ అంటే అది చెప్పిన ఏడు కారణాలతో చెప్పాలంటే….
కారణం1- మొదటి స్టెప్ లో ఈ ఇంద్రసేన ట్రైలర్ జాగ్రత్తగా మరో సారి చూడండి.

జీవితం అంటే ఇంతే , సింపుల్ గా ఒక్క నిమిషం టీజర్ లో తేల్చిపడేసింది.ఎంతో పెద్ద ఫిలాసఫిని ఒకే నిముషంలో చెప్పడం అన్నది సినిమా కున్న పవర్ ని చూపిస్తుంది.
కారణం-2- ఏదో పూరి జగన్నాధ్ సినిమా డైలాగ్…జీవితం అందరి దూల తీర్చేస్తుంది…
2008 రికార్డు చేసిన రాజశేఖర్,జీవిత గార్ల ఈ వీడియో జాగ్తత్తగా చూడండి.

ఎలాంటి బాధలు,ఆర్ధిక ఇబ్బందులు లేని సమయంలో రాజశేఖర్ మాటల్లో చేతల్లో హవభావాల్లో ఆత్మవిశ్వాసం ఎంత ఇదిగా కనిపిస్తుందో గమనించే ఉంటారు.
కారణం-3. ఇంతలో జీవితంలో తెలియని శక్తి ఆగమనం..
అంతా తన చేతుల్లో ఉంది అనుకునే మనిషికి ఇంతలో సడెన్ గా ప్రవేశించిన ఆ కొత్త శక్తిని ఎలా అర్థం చేసుకోవాలో , ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు..

కారణం-4. అతనే శనీశ్వరుడు… లేదా మరే ఇతర పేరైన మతాలు, విశ్వాసాలతో సంభందం లేకుండా… ఒక S శక్తి అనే పేరుతో ఇతన్ని పిలుచుకుందాం..
.హీరో రాజశేఖర్ అయినా కోటిశ్వరుడైనా,రాజైనా అతని కర్మ పరిహారం క్లియర్ చేస్తూ, జీవితం అంత తన చేతుల్లో ఉందనుకునే మనిషికి తన చేతుల్లో లేని మరేదో అతీత శక్తుల వలన జీవితం నడుస్తుందన్నా విషయం అతనికి సంపూర్ణంగా అర్థం అయ్యేలా చేయడానికి శనీశ్వరుడు ఎంటర్ అవుతాడు..
ఎక్కడో దూరంగా ఉన్న శని గ్రహం మనిషి మీద ప్రభావం చూపడం ఏంటి నాన్సెస్ అనే జనవిజా్న వేదిక టైపు మేధావుల కోసం నేను ఇక్కడ జ్యోతిష్యాన్ని చర్చించడంలేదు.
అసలు గ్రహం ఎక్కడో సూర్య కుటుంభంలో గురు గ్రహం అవతల లేదు..మన శరీరంలోనే అది ఉంది..గోడ గడియారం లో అది గంటల ముల్లు లాంటిది..మిట్ల మధ్యాహ్నం 1గంటకి బయటకి వెళితే ఎండ చుర్రుమంటుంది అని 1గంట ముల్లును తిడితే ఏంలాభం? శనీశ్వరున్ని భాధలు పెడుతున్నాడని ఆడిపోసుకున్న అంతకు మించి మరేమికాదు..
మనిషి జీవితంలో కష్టపడాల్సిన టైం వచ్చేసరికి ఆగ్రహ స్థితిలో గడియారంలో ముల్లు మాదిరిగా అక్కడ ఆయన ఉంటున్నాడంతే…తనను తాను మరిచిపోయింతా అహంకారం పొరలు విప్పడానికి అతని ఎంట్రెన్స్ ఖచ్చితంగా మనుషులందరు సమిష్టిగా ఏర్పాటు చేసుకున్న S అనే గంటల ముల్లు..అది గ్రహంగా బయటెక్కడో లేదు, శరీరం లోపలే ఉంది..అ టైంలో మనిషికి ఏదో చేద్దామని ఆలోచన వస్తుంది. దాన్ని ఎవరు ఆపిన అపకుండా చేస్తాడు.ఆ ఆలోచనను ప్రోద్బలం చేసేవాడు ఆయన.ఆ ఆలోచనను జీవితంలో అములు పర్చగానే మనిషి ఆ కష్టాల అనుభవసారాన్ని, తద్వార జీవిత వాస్తవ విలువను సంపూర్ణ అనుబూతితో తెలుసుకుంటాడు.ఏం నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉంటానని మనిషి అంటే అతనికి ఇతర మహ పవర్ ఫుల్ శక్తుల నియంత్రణ ఉంటుంది.. ప్రమాధాలు,ఆక్సిడెంట్స్,భూకంపాలు,సునామిలు..తీవ్రవాద పేలుల్లు..ఇతరాత్ర ఏదో ఒక రూపంలో ఆయా మనుషుల జీవితాల మీద తన ప్రభావం చూపిస్తాడు..చూపిస్తాడు అనే కంటే కరెక్ట్ పదం..మనమందరం ఏర్పరుచుకున్న ప్రభుత్వం,ప్రభుత్వం ఏర్పరిచిన ట్రాఫిక్ సిగ్నల్స్ తప్ప దాటి ముందుకెళితే ముందున్న ట్రాఫిక్ పోలీసులు చాలాన్ లు శిక్ష వేయడం లాంటిదే ఈ S శక్తి ..మనం అందరం మన అందరి బాగు కోసం ఏర్పరుచుకున్న శక్తే ఇది…సో..అనవసరంగా ఈ శక్తిని నిందించి లాభం లేదు..
సినిమా భాషలో చెప్పాలంటే కొందరు అర్టిస్టుల ప్రవర్తనల్లో సక్సెస్ వచ్చాక అహంకారం పొరలు కమ్మితే ఈ S శక్తి నే డైరెక్టర్స్ మైండ్స్ లో పనిచేస్తూ అలాంటి ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వడం తగ్గిస్తుంది…చిన్నప్పుడు నుండి జీవితంలో ఎలాంటి బాధ అంటే తెలియకుండా కన్ను మిన్ను రాకుండా పూర్తి అహంభావంతో ఉండే మనుషులను మీరు చాలా మందినే చూసి ఉంటారు..ఇప్పడు చెప్పండి వాళ్లందరిని సెట్ రైట్ చేయడానికి ఈ S శక్తి కమాండ్ కంట్రోల్ అవసరం ఉందా లేదా???
Image result for shani god

కారణం-5. రాజశేఖర్ గారి జీవితం లో ఈ S శక్తి కొన్ని సంవత్సరాలు పనిచేయగానే…అతని జీవితంలో నైనా మరెవరి జీవితంలో నైనా అతని శక్తియుక్తులు పూర్తిగా ఉడిగిపోతాయి. ఇక తన చేతుల్లో ఏంలేదని తెలుసుకున్నాకా…..ఆ సమయంలో .ఆ టైంలో ప్రవీణ్ సత్తార్ లాంటి ఒక డైరెక్టర్ ,కోటేశ్వరరాజు గారి లాంటి ఒక ప్రోడ్యూసర్ ఎంటర్ అవుతారు.ఆ స్థితి లయలు,హొయలు ఎలా ఉంటాయో…ఇక్కడ రాజశేఖర్ గారి .స్పీచ్ మొత్తం జాగ్రత్తగా వినండి…

కారణం-6- నాన్ స్టాప్ గా శత్రువుతో ఫైట్ చేసి ఇక తన చేతుల్లో ఏంలేదని పైన హాలివుడ్ సినిమా End of the Days హీరో ష్వార్జెనెగ్గర్ తెలుసుకుని జీసస్ ముందు దైవసహాయం కోసం కూలబడుతాడు..
తల్లిని,అయిన వాళ్ళని ఆగోచర అర్థం కాని రీతిలో కొల్పోతున్న దశలో….కష్టాలన్ని కూడబలుక్కుని మీద పడుతున్న దశలో..
ప్రతి వీడియో జాగ్రత్తగా చివరి వరకు చూడండి…

ఇక్కడి రాజశేఖర్ గారి మాటల్లో కూడా ఇక నా టాప్ టూ బాటమ్ ఏమిలేదు అంతా అయిపోయింది అని పబ్లిక్ గా ఏడ్చేసిన తరువాత..
అప్పుడు ఊహించనవి జరుగుతుంటాయి ,మరింకేదో శక్తులు పనిచేయడం మొదలవుతాయి…శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు…

ఎక్కడెక్కడినుండో ఆశీర్చనాలు అందుతాయి.

కారణం 7- అప్పడు వస్తుంది సక్సెస్…..దీన్ని ముందుగ ా ముందుగా అంచనా వేసే నేను రాజశేఖరుడు గత పదేళ్ళుగా అనుభవిస్తున్న జీవితానికి గరుడవేగ సక్సెస్ కి లింక్ పెట్టి నేను ముందుగా ప్రిడిక్ట్ చేయగలిగాను..అంతకు మించి మరేంలేదు…

గరుడవేగ సక్సెస్ రాజశేఖర్ వ్యక్తిగత జీవితానిది అయితే..

సినిమా పేరు ప్రతిష్టలు దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు,

ఫైనాన్సియల్ లాభనష్టాలు నిర్మాత జీవితానికి వర్తిస్తుంది.

ఇక సూటిగా గరుడవేగ సమీక్షకు వద్దాం…సినిమా ఈ రోజే ఆదివారం చూసాను..

ముందుగా ప్రవీణ్ సత్తార్ కు సినిమా పట్ల ఉన్న నిబద్దత, నిజాయితి ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమా కామెంట్ పై గమనించవచ్చును..

స్రిప్టు నేరేట్ చేయడంలో నా టైప్ మెంటాలిటి ఉన్న ప్రవీణ్ గురించి మరింతగా తెలుసుకున్నాకా..

ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది..ప్రజలు 1000 కోట్లు తినే రాజకీయనాయకుడికన్నా 100 కోట్లు తినే రాజకీయ నాయకుడు బెటర్ అని అతనికే ఒట్లు వేస్తారని…అదే ఈ సినిమాకు కూడా వర్తిస్తుంది.. ఒవర్ ఆల్ గా సినిమా బాగుంది…కాని ఈ వారంలో పోటి ఇచ్చే ఇతర సినిమాల్లో విషయం లేకపోవడంతో ఉన్నంతలో ఈ సినిమానే బెటర్ అనుకుని పబ్లిక్ దీన్ని విరగబడి చూస్తారు..డౌట్ లేదు…పైగా థీయోటర్లు కూడా చాలతక్కువ 250 మాత్రమే రెండు రాష్ట్రాల్లో కలిపి..
కొన్ని లోటుపాట్లను వదిలేస్తే సినిమా ఓవర్ ఆల్ గా ఓకే…ఇక సూటిగా విషయంలోకి వస్తే…

సగటు సినిమా ప్రేక్షకుడి స్థాయిలో సమీక్షగా కాకుండా ఈ సమీక్షను డైరెక్టర్స్ కోణంలో మాత్రమే ఆలోచిస్తే,..అర్జున్ రెడ్డి సినిమా విషయంలో అంత నిజాయితిగా చెప్పిన ఈ దర్శకుడు , పదేళ్ళ క్రితం రాసుకున్న కథను ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా మార్చి రాయడంతో కథలో గందరగోళం ఏర్పడింది. ఫష్టాఫ్ లో స్ర్కీన్ ప్లే పట్టుతో ఆసక్తిగా లాక్కుపోయిన దర్శకుడు సెకండ్ ఆఫ్ లో అనవసర తెలుగు కథనా ఫార్ములను ఇరికించే ప్రయత్నం చేసాడు.ఇందుకు దర్శకుడిని తప్పు పట్టలేం..రాజశేఖర్ లాంటి మార్కెట్ లేని హీరో మీద .30 కోట్ల బడ్బెట్ అంటే ఏ మాత్రం తేడా వచ్చినా గోవిందో గోవిందా భయం అందరికి వెంటాడుతుంది కాబట్టి ఈ కథనాలు దర్శకుడికి తప్పవు..
ఈ దర్శకుడికి హలివుడ్ సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.. తన ఊహ శక్తితో కొత్తగా హలివుడ్ రేంజి అధ్బుత మైన షాట్స్ తీసే బదులు మొహమాటం లేకుండా డైరెక్టుగా ఆ షాట్స్ వాడుకున్నాడు..
గొల్డెన్ ఐ సినిమా ఒపెనింగ్ సినిమా నుండి…
https://www.youtube.com/watch?v=mSvuHSqqGSw
కార్ రేసింగ్ సీన్స్ లో ట్రాన్స్ పోర్టర్ మూవి ఎపెక్ట్ ఎక్కువ..రాజశేఖర్ కారు నదిలో మునిగాక బ్రిడ్జిపైనుండి విలన్స్ ఫైరింగ్..

హాలివుడ్ సినిమాల షాట్స్ బాగుంటాయి, బాగున్నాయి వాడుకున్నాడు బాగుంది కాని..
వారు తప్పని సరిగా ఫాలో అయ్యే లాజిక్ ఇక్కడ గాలి కొదిలేయడమే బాధాకరం…సినిమా బాగున్నదంతా మనస్పూర్తిగా మెచుకుని, ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే
సినిమా మరెంత బాగా వచ్చేదో మాత్రమే ఇక్కడ చూద్దాం..
1.తాను ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా చేసే డ్యూటీలను సింపుల్ గా అప్పటి వరకు భార్యకు చెప్పకుండా కొర్డు నుండి వచ్చిన అలీ కారెక్టర్ కు చెప్పడం చాలా సిల్లిగా ఉంది..
హీరో ఎస్టాబ్లిష్ మెంట్ సరిగా లేదు…రాజశేఖర్ మొదటిసారి స్రీన్ మీద కనపడగానే ఏ ప్రేక్షకుడు ఈల వేయలేదు..
2.సినిమాలో చాలాసార్లు ఎదురుగా కనపడ్డవాడ్ని చంపేయకుండా, ఎదుటివాడు తప్పించుకుని పారిపోవడానికి కావాలని రిలాక్స్ గా అవకాశాలు ఇచ్చినట్లు కనపడుతుంది.
అది విలన్ మూఠా లో వారైనా, రాజశేఖర్ కారులో నదిలో పడిపోయినప్పడైనా కూడా. ఇదే పొరపాటు క్లైమాక్స్ లో కూడా రీపీట్ అయ్యింది..
ఇదెన్ని వేల కోట్ల రూపాయల ప్లూటోనియం స్కామో చెప్పి దాంట్లో రాజశేఖర్ అనవసరంగా తలదూర్చాడని చెప్పిన విలన్ అతన్ని చంపేయకుండా భార్యతో సహా
సముద్రంలో డెడ్జింగ్ ప్లాట్ ఫారంపై సర్వర్ తో సహా పేల్చేయాలని ఆలోచిస్తుంటాడు…ఇది మరి 20 ఏళ్ళ క్రితం లాజిక్, స్ర్కీన్ ప్లే..
3..ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ కి ఆటమిక్ ఎనర్జీ కమీషన్ గురించి తెలియకపోవడం, అదీ హకర్ విడమర్చి చెపుతుంటే విసుగ్గా వినడం చండాలంగా ఉంది..ఏమాత్రం ఇంటెలిజెన్స్ లేని ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ కు అది సరిపోతుంది తప్ప హీరోకు సరిపోని తెలివితేటలు కావు అవి.కారు నదిలో పడిపోయాకా తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నాక దూరంగా
బ్రిడ్జిమీద విలన్స్ కనపడుతూనే ఉంటారు, కనీసం చెట్ల మాటుకు ఆడవిలో చాటుకు పోయి దాక్కునే ప్రయత్నం కూడా చేయకుండా హకర్ స్టోరి ని హీరో వినడం మొదలుపెడుతుతాడు.
4.చార్మీనార్ దగ్గర పవర్ ఫుల్ బాంబ్ పేలుతుందని తెలిసాక హీరో అమాయకంగా రొడ్లు వెదుకున్నప్పడు అక్కడ ఒక పార్టీ జెండాలు కట్టేవాడు చెప్పేవరకు కూడా అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడి రోడ్ యాత్ర జరుగుతుందని తెలియకపోవడం హీరో పాత్ర దయనీయ స్థిితిని తెలియపరుస్తుంది..పోలీస్ హౌైకమాండ్ నుండి స్పాట్ లో ఆరోజుకు పాతబస్తిలో పొజిషన్ ఏంటీ ర్యాలీలు,మీటింగ్ లు,నమాజులు ఏమున్నా ప్రతి ఒక్కటి ప్రతి పోలీస్ ఆఫీసర్ కి ముందుగానే తెలుస్తుంది.
5.మేయిన్ విలన్ ఎవరు ,హీరో ఎవరితో తలపడాలి అనేది ముందుగా తెలియపర్చడమే ప్రతి సినిమాకు బిగ్గెస్ట్ అసెట్..విలన్ ని ఇంటర్వల్ తర్వాత ఎంటర్ ఛేయడం, అది బలహీన మైన విలన్ ను ఏ మాత్రం బిగువు లేని కధనానికి దారితీస్తుంది.సినిమాను తొందరగా మర్చిపోయేలా చేస్తుంది…
6. సన్నీ లియోన్ డియ్యో డియ్యో డాన్స్కు అందరు ఎగురుతుంటే వరుసగా విలన్ మూట అందర్ని చంపూతూ ముందు కెళ్ళడం …చావుకు ముందు సరైన కారణాన్ని, పాత్రలతో ఎమోషనల్ అటాచ్ ఏర్పరచకుండా ఎంతమందిని చంపినా కూడా అది ఒక వీడీయో గేమ్ చూసిన అనుభూతే మాత్రమే మిగులుతుంది..ఇక్కడ అందరిని చంపాల్సిన అవసరం లేదు..ఈ సీన్ special forces లో 56వ నిమిషం నుండి ఓ పది నిమిషాలు సీన్ చూడండి దానికి అనుకరణ ….అందుకే ఇక్కడ గరుడవేగలో లాజిక్ మిస్ అయ్యింది.https://www.youtube.com/watch?v=psgjC6Iu9zI
7.నాగపూర్ కుి హాకర్ ని తీసుకు వెళుతుంటే విలన్ మూట పెద్ద ట్రక్ లతో అటాక్ చేస్తుంటే ఎన్.ఐ.ఎ.సెక్యూరిటి స్టాఫ్ చేష్టలుడిగి షాక్ కావడం రియల్లిపిటి..జైలు ఖైదీలకు
ఎస్కార్ట్ గా పోయే పోలీస్ కానిస్టేబుల్ లాంటిది పరిస్థితిలో తేడా వస్తే తన తుపాకికి పనిచెపుతాడు..ఆమాత్రం రేంజ్ రివర్స్ అటాక్ వారినుండి మనం ఆశిస్తాం…
ఏదో పరువు పోకుండా హీరో కాబట్టి రాజశేఖర్ ఒక్కడే పిస్టల్ తీసి ట్రక్ మీదకు కాల్చాడు.క్లైమాక్స్ లో కూడా ఇదే మిస్టేక్ .హీరో ,భార్య , హాకర్ డెడ్జింగ్ .ఫ్లాట్ ఫాం పైన ఉన్నప్పడు వెంటనే చంపేయకుండా లేదా కనీసం వారు ఏంచేస్తున్నారనేది బైనాక్యులర్ లో కూడా చూడకుండా విలన్ రిలాక్స్ గా ఉంటాడు..వారు తప్పించుకుని తీరిగ్గా
బాంబులన్ని విలన్ షిప్ మీదకు విసిరాక అప్పడు రిమోట్ పేలుస్తాడు,విలన్ గ్యాంగ్ అంతమైపోతుంది..
…………………… ఇలాంటి పొరపాట్లు మన తెలుగు దర్శకులు మొన్న స్పైడర్ లో మురుగదాసైన, దీంట్లో ప్రవీణ్ సత్తారైనా ఎందుకు రీపీట్ చేస్తారో నాకు అర్థం కాదు..