జన్మ- పునర్జన్మ- కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం,హార్డ్ డిస్క్. 0

జన్మ- పునర్జన్మ- కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం,హార్డ్ డిస్క్.

        స్తబ్దంగా ఉన్న కొత్త కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టం  ఉదాహరణకు విండోస్ 10.0  ఇన్ స్టాల్ చేయడమే మనిషి కొత్త జన్మ లాంటిది..కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం ఇక్కడ ఆ కంప్యూటర్ ప్రత్యేక ఆత్మ. వేరే కంప్యూటర్స్ లలో అదే ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ అయి ఉన్నప్పటికి కూడా ఈ కంప్యూటర్ వేరు ఆయా కంప్యూటర్స్ వేరు..అలాగే ఈ మనిషి శరీరంలో ఉన్న ఆత్మ వేరు, ఇతర మనషుల శరీరాల్లో ఉన్న ఆత్మలు వేరు.ఉన్నది ఒకటే ఆపరేటింగ్ సిస్టం. అదే ఆపరేటింగ్ సిస్టం అనేక కంప్యూటర్స్ లలో అనేక రూపాలుగా పనిచేస్తుంది.ఏ కంప్యూటర్ ప్రత్యేకత దానిదే, ఒక కంప్యూటర్ లో ఉన్న అప్లికేషన్స్ మరో కంప్యూటర్ లో ఉండవు.ప్రతి కంప్యూటర్ విబిన్నమైనదే..  ఉన్నది ఒక్కటే ఆత్మ , సర్వ వ్యాప్తి, విబిన్న శరీరాలలో విభిన్న ఆత్మలుగా భాసిల్లుతుంటుంది. ఆత్మకు , శరీర పరిమితులు, జన్మల అవదులు లేవు. ఒక ఆపరేటింగ్ సిస్టం సీ.డి.-డి.వి.డి.కాపితో ఎన్ని కంప్యూటర్స్ లలో నైనా ఇనస్టాల్ కాగలుతుంది …….ఎన్ని శరీరాలలోనైనా మనగలుగుతుంది..
..కంప్యూటర్ లోని సమాచారం అంతా   హర్డ్ డిస్క్ లో స్టోర్ అయి ఉంటాయి.  మనిషి  జన్మ తాలుకు జ్ఞాపకాలు అన్ని అతని  మెధడు లోని  సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి.. ఒక కంప్యూటర్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు ఆ కంప్యూటర్ లోని హర్డ్ డిస్క్ ను ఫార్మెట్ చేయగానే దాంట్లోని డాట సమస్తం తుడిచివేయబడుతుంది. ఇది కంప్యూటర్ మరణం లాంటిది.. కాని అదే భౌతిక ఉనికి గల కంప్యూటర్ లో తిరిగి మళ్ళీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేయగానే ఆ కంప్యూటర్ కు ఆత్మ – ప్రాణం వచ్చి చేరుతాయి… కాని మనిషికి అతని మరణంతో సమస్త జ్ఞాపకాలు తుడిచివేయబడుతుతాయి.కొత్త శరీరంతో కొత్త జన్మలో ఆ జ్ఞాపకాలు ఏవి గుర్తుండవు…
కాని తుడుచి వేయబడిన కంప్యూటర్ డేటా కైనా ,గత జన్మలోని మనిషి జ్ఞాపకాలనైనా తిరిగి పొందడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి.
కంప్యూటర్ హర్డ్ డిస్క్ ను ముందు పెట్టుకుని ఫార్మాట్  – ఎరాస్ చేయబడిన డాటను ఫైల్ రికవరి సాఫ్ట్ వేర్స్ సహాయంతో తిరిగి పొందవచ్చును.ఎరాస్ అయిన మొత్తం ఫైల్స్, వీడియోస్,ఇమేజెస్ అన్నీ కూడా…కొన్ని అడ్వాన్సడ్ ఫైల్ రికవరి సాఫ్ట్ వేర్స్ ఎన్ని సార్లు ఎరాస్ – ఫార్మెట్ అయిన హార్డ్ డిస్క్ లలోని డేటాను కూడా తిరిగి రికవరి అయ్యేలా చేస్తాయి . అలాగే మనిషి ధ్యాన పద్దతుల ద్వారా కూడ ఇలాగా గత జన్మ జ్ఞాపకాలను తిరిగి పొందవచ్చు. లేదా థర్డ్ పార్టి రికవరి సాఫ్ట్ వేర్స్ మాదిరిగా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషనిస్టులు విభిన్న పద్ధతుల ద్వారా ఇతరులను ఇలా గతజన్మలలోకి తీసుకుపోగలరు.తెలుగు వాళ్ళలో హైదరాబాదులో ఉండే డా.న్యూటన్ కొండవీటి ఈ విషయంలో చాల ప్రసిధ్దుడు..
కంప్యూటర్ డాటా ఫార్మెట్ కావడంతో తుడిచిపెట్టబడుతుంది,మనిషి మరణంతో అతని డేటా తుడిచిపెట్డబడుతుంది.మరి అదే భౌతిక స్థితిలోని కంప్యూటర్ లో తిరిగి ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేయవచ్చను.కావాలంటే వంద మార్లు, వేయిమార్లు కంప్యూటర్ డాటా ఫార్మెట్- ఎరాస్ చేయవచ్చును, తిరిగి ఆపరేటింగ్ సిస్టం- ప్రాణం -ఆత్మను పునరుద్దరించవచ్చును.కాని చనిపోయిన మనిషి శరీరరంలో అదే ఆత్మ ను ఎందుకు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలా ప్రవేశ పెట్టలేకపోతున్నారు?
మనుషుల , ఇతర జీవుల శరీరాలన్నీ కార్బన్ బేస్డ్ (బొగ్గు)తో చేయబడ్డ శరీరాలు కాబట్టి.(కార్బన్ అణు సంఖ్య – 6)
మీరు జీవం ఉన్న ఏ శరీరం అయిన,చివరకు మొక్కను కూడా చనిపోయాక కాల్చి వేసి చూడండి.దాంట్లో చివరకు మీకు బొగ్గే కనపడుతుంది. జీవుల శరీరాలన్ని కార్బన్ బొగ్గు బేస్డ్ శరీరాలన్ని రేడియోలో వాడే వన్ టైమ్ యూజ్ బ్యాటరీల వంటివి.. ప్రాణుల శరీరాలన్ని ఒక్కసారి వాడకానికే పనికివస్తాయి..కంప్యూటర్స్ అన్ని ఇతర మెటల్స్ బేస్డ్ తో తయారైనవి. కాబట్టి వాటిని మళ్ళీ మళ్ళీ వాడవచ్చు.
మనిషి ఫ్రాణం- ఆత్మను కూడా ఇలాగే మెటల్ బేస్డ్ శరీరాలతో దేవుడు తయారుచేస్తే సరిపోయేదిగా,  వన్ టైమ్ యూజ్ కోసం కార్బాన్ బేేస్డ్ శరీరాలను తయారు చేసి,ఆ శరీరాలకు రోగాలను,వ్రుద్యాప్యాన్ని ఇచ్చి మనషుల జీవితాలతో దేవుడు ఎందుకు ఆడుకుంటున్నట్లు?  యోగాలో అత్యన్నత స్థితికి చెందిన యోగులు పరకాయ ప్రవేశం ద్వారా చనిపోయిన అదే శరీరంలోకి వారి ఆత్మ ద్వార ఎంటర్ అయి ఆ శరీరంతో తిరిగి బతుక గలుగుతారు.కాని అందరి వల్ల ఈ పని వీలు కాదు.కోటిలో ఏ ఒక్కరికో ఇది సాథ్యం..పైగా 60 ఏళ్ళ పైబడిన శరీరంలోని అవయవాలన్ని అప్పటికే క్రమేపి క్షిణించి ఉంటాయి.కంటి చూపు,వినికిడి సరిగా ఉండదు,ఇతర శారీరక సమస్యలెన్నో ఉంటాయి..కాబట్టి పాత బడ్డ శరీరంలోకి , దాన్నుండి  బయటకు వచ్చిన ఆ  ఆత్మ కూడా ఇష్టపడదు అదే శరీరంలోకి తిరిగి ఎంటర్ కావడానికి. శ్రీ క్రుష్ణుడు చెప్పినట్లుగా పాత వస్ర్తాన్ని వదిలి కొత్త వస్ర్తం దరించి నట్లు పాతబడ్డ శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త శరీరంతో తిరిగి శిశువుగా జన్మిస్తుంది.ఈ కొత్త శరీరం ఎక్స్ పైర్ టైం మరో 100 ఏళ్ళు ,  కనీసం 50   ఏళ్ళు పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేస్తుంది కాబట్టి శరీరం నుండి బయటకి వచ్చిన ఆత్మ కొత్త శరీరంతో శిశువుగా పుట్టడానికే ఇష్టపడుతుంది.
కాని సమస్య అంతా 100 ఏళ్ళ లైఫ్ టైం ఎక్స్ పైర్ టైం కల కార్బన్ బేస్ డ్ శరీరాలే ఈ భూమిమీద ఉన్నట్లు, వాటిద్వారానే ఫ్రాణం- ఆత్మ ఎందుకు కొనసాగుతున్నట్లు…???? కంప్యూటర్ మాదిరిగా ఏ ఇతర మెటల్స్ తో శరీరాలను తయారు చేసి వాటిలో ఆత్మ ప్రవేశిస్తే చాలా వందల ఏళ్ళు జీవించ వచ్చుగా.??.
దేవుడు జాదగాడు కాదు అని ఐన్ స్టీయిన్ ఉవాచ. ఈ భూమి మీద ,ఈ సౌరకుటుంబంలో , ఈ ధర్డ్ డైమెన్షన్ ప్రపంచానికి కార్బన్ బేస్డ్ స్రుష్టే బెటర్ అని భావించాడు కాబట్టి ఈ భూమి మీద ప్రాణులన్ని కార్బన్ బేస్డ్ తో తయారైనాయి.కారణం కార్బన్ అణువులలో మాత్రమే శరీరం విడిపోకుండా , విచిన్నం కాకుండా బందనాలను ఏర్పరిచే గుణం ఉన్నది కాబట్టి.శరీరంలో జీవ రసాయన చర్యలు ఎన్ని జరిగినా కూడా పకడ్బండి బంధానాలను ఏర్పరిచి శరీరాన్ని ఏకతాటిన అది ఉంచగలగుతుంది కాబట్టి.ఒక యురేనియం అణు బాంబులో మాదిరిగా జరిగే అణువిచ్చితి మాదిరిగానే శరీరం కూడా ఒక +,- ఎనర్జీల స్ర్తీ ,పురుషుల x,y క్రోమోజామ్ ల ఏక కణం నుండి రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా, ఆ ఎనిమిది పదహారుగా, తదనంతరం వేలు,లక్షలు, కొట్ల కణాలుగా ఏర్పడుతు, ఒక యవ్వనావస్థకు రాగానే అంతటితో ఆ శరీర  పెరగుదల ఆగిపోయేట్లుగా చేేసే మహా ప్రోగ్రామింగ్ కు ది బెస్ట్ బయో ఆర్గానిక్ ఎలిమెంట్ కార్బనే కాబట్టి..ఈ భూమి మీద మాత్రం ప్రాణులన్నింటికి కార్బన్ బేస్డ్ శరీరాలే ఏర్పడ్డాయి.
ఇతర గ్రహాల్లో , ఇతర నక్షత్ర కుటుంభ ప్రాణుల్లో ఇతర ఆర్గనిక్  అణువుల అంటే నైట్రోజన్, పాస్పరస్, ఆమ్మోనియా, ఆక్సిజన్ జీవులు అతి సహజంగా ఉండే అవకాశం ఉంది.దానిని ఏమాత్రం కొట్టి పారేయలేం.అలాగే సిిలికాన్ బేస్డ్ జీవులు మనం కంప్యూటర్ గా, స్మార్ట్ ఫోన్ గా చూస్తూనే ఉన్నాం.. అవి మాట్లాడుతాయి,శభ్దం చేస్తాయి,వింటాయి..దాదాపు ప్రాణులు చేసే అన్ని పనులు చేస్తాయి..రోబో సినిమాలో చిట్టి రోబో ఫీలయినట్లు ఆ ఒక్కటి …సంతాన ఉత్పత్తి తప్ప మిగితా పనులు అన్ని చేయగలుగుతాయి. శరీరం జీవంతో కొనసాగడానికి సిస్టమేటిక్ అణుబందం,జీవ రసాయన చర్యలు అన్ని కొనసాగే వ్యవస్థ  కార్బన్ లో ఉంది కాబట్టే భూమిమీద జీవులన్నీ కార్బన్ బేస్ డ్ శరీరాల స్రుష్టికి దేవుడు పూనుకున్నాడు. ఒక కంప్యూటర్ కు మరొక కంప్యూటర్ కు మద్యన ఇంటర్ నెట్ ద్వార కనెక్ట్ కాగలుగుతున్నాం. ఒక మనిషి మరొక మనిషి ప్రత్యక్ష్యంగా , పరోక్షంగా ఫోన్ లో కనెక్ట్ కాగలుగుతున్నాడు. కాని ఇతర ఆర్గనిక్ శరీరాలతో మనుష్యులుగా మనం కమ్యూనికేషన్ కావడం అంటే చాలా కష్టమైన పని. పక్క రాష్ట్రం , దేశంలోని మనుషులతోనే మనం ఇంటర్ మీడియం లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ఉంటే తప్ప కమ్యూనికేట్ చేయలేకపోతున్నా.అదే విదంగా జంతువులతో, పక్షులతో ఎలాగు కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం.ఇక ఇతర ఆర్గనిక్ శరీరాలతో ఇతర గ్రహాల నుండి వచ్చే గ్రహాంతర జీవులతో కమ్యూనికేట్ చేయాలన్నా ఇలాంటి ఇంతకు మించి సమస్యలే ఉంటాయి.
మనం ఇంతవరకు   కంప్యూటర్  ఆపరేటింగ్ సిస్టం , మనిషి ఆత్మ ఒకటే అనే అర్ధంతో పరిశీలించాం.దీంట్లో కొందరు పాఠకులు ఆత్మ ఆనేది ఒకటే అనేక కంప్యూటర్లలో అనేక ఆత్మలుగా కొనసాగుతుందంటే వెంటనే వచ్చే డౌట్ మరి  విండోస్ ఆపరేటింగ్ సిస్టం కాకుండా ఇతర కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంల సంగతేంటి అని అడుగుతారు.అవే ఆపిల్ కంప్యూటర్ లలో వాడే మాకింతోష్, ఉబంటు , యునిక్స్ ,లైనక్స్ లాంటి ఇతర ఆపరేటింగ్ సిస్టంల సంగతి.ఇలాంటివి దాదాపు 100 పైనా ఉన్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్ లలో ఆండ్రాయిడ్, విండోస్,ఐ.ఓ.ఎస్. మరెన్నో.  మరిన్ని కొత్త ఆపరేటింగ్ సిస్టం భవిష్యత్తులో మరిన్ని వస్తాయి.మరి ఇన్ని అనేక ఆత్మలా అనే సందేహం వస్తుంది..
తల్లి తండ్రులు ఒక్కరే , కాని x,y క్రోమోజోమ్ కలయికతో ,పుట్టే సమయం, అంతర్గత డి.ఎన్.ఎ.అనేక ఇతర కాంబినేషన్స్,కాలిక్యులేషన్స్ వలన  పుట్టే పిల్లల్లో విభిన్నమైన తెలివితేటలు, అందం,దైర్యం ఎలా ఏర్పడుతున్నాయో, ఆపరేటింగ్ సిస్టం అవసరాలు, ఆ కంప్యూటర్ ప్రాసెసర్ స్పీడ్ ,రామ్ స్పీడ్ , శక్తుల ప్రకారంగానే అందుకు తగ్గ అపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేయబడుతుంది. కాని వీటన్నింటి స్రుష్టికర్త మానవుడే అయినట్లు, అందరి మానవుల , ప్రాణుల సూపర్ సోల్ ఒక్కటే అయినట్లు. అందరి మానవుల ఆత్మ బేసిగ్గా ఒకటే అయినా కూడా మనుషుల్లో శిశు ఆత్మలు,బాలాత్మలు,యవ్వనాత్మలు,మద్యవయసు ఆత్మలు,వ్రుద్ద ఆత్మలు ఉంటాయి. ఆయా ఆత్మల అర్హత ప్రకారంగానే ఆ ఆత్మలు ఆయా శరీరాలను దరించి  అయా పనులు చేస్తున్నారు.
ఈ వ్యవస్థను సులువుగా అర్థం చేసుకోవాలంటే…..
1)కంప్యూటర్లలో అత్యదిక శాతం వ్యక్తిగత కంప్యూటర్స్ లో వాడేది విండోస్ ఆపరేటింగ్ సిస్టం..వీరినుండి ఉండే సూపర్ సోల్ లో నుండి ఉద్బవించే వారంతా సాదారణ మనుషులుగా,సాదారణ ఆత్మల కోవలో చేరుతారు.
2)నూటికి 30 శాతం వాడే ఆపిల్ కంప్యూటర్స్ లలో మాకింతోష్ ఆపరేటింగ్ సిస్టం వాడబడుతుంది.  అధ్భుత మైన అందంతో ప్రపంచాన్ని మరిపించే  సినిమా స్టార్స్, మాడల్స్, అందగాళ్ళు,అందగత్తెలు.
3) బ్రహ్మాండమైన వ్యవస్థలను అంటే రోజుకు లక్షలమంది ప్రయాణించే రైళ్ళ రిజర్వేషన్స్ , అప్ డేట్స్ ను తట్టుకోవడానికి  సూపర్ పవర్  64 బిట్  ఇటానియం 9340కంప్యూటర్స్ తో పనిచేయగలిగే  ఓపెన్ వి.ఎమ్.ఎస్. లాంటి ఆపరేటింగ్ సిస్టం కావాలి…ఆలాంటి సూపర్ సోల్ ఆంశాత్మలే దేశాధినేతలు,మల్టినేషనల్ కంపెనీల చైర్మెన్స్, సీ.ఇ.వోలు,సోషల్ నెటవర్కింగ్ వెబ్ సైట్స్ ఓనర్స్,టి.వి.చానెల్స్ ఓనర్స్, సినిమా దర్శక -నిర్మాతలు..లక్షల,కోట్ల మందిని వీరు సంబాలించాల్సి వస్తుంది.
4)హై ఎండ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం లలో ఉబంటు,లైనక్స్ అడ్వాన్స్డ్ సిస్టంలు… మనుషుల్లో ఒక జేమ్స్ కెమరాన్,స్టి వెన్ స్పిల్ బర్గ్, ఒక ఐన్ స్టీయిన్, ఒక స్టిఫెన్ హాకింగ్ తధితరులు..వీరి మేథ హై ఎండ్ ప్రాసెసింగ్ లో పనిచేస్తుంది…

ఇంట్లో వాడే 230 వాట్స్ కరెంటు షాక్ ను తట్టుకోగలిగే శరీరం , హైటెన్షన్ కరెంటు వైరు ను ముట్టుకుంటే షాక్ తగిలి చనిపోతుంది. అర్హత లేని శరీరం,ఆధ్మాత్మికతను ఐనా అపార సంపదలైనా, అధికారాన్నానా నిభాయించుకోలేదు.అయా ఆత్మల సాధన, అర్హతల ప్రకారంగానే వారికి ఆయా అవకాశాలు ఏర్పడుతాయి.