spirituality
spirituality
Balakrishna Master @Pyramid Spiritual Societies Movement- Interview by Ravinder 0
by ramthamedia • spirituality • Tags: bangalore pyramid spiritual society, pyramid spiritual society, pyramid spiritual society books, pyramid spiritual society meditation music, pyramid spiritual society movement, pyramid spiritual society movement live, pyramid spiritual society of india
Balakrishna Master @Pyramid Spiritual Societies Movement- Interview by Ravinder పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ బ్రహ్మర్షి పత్రీజీ గారు వ్యవస్థాపించారు. పాత మతాల నుంచి విడివడిపోయి క్రొత్త నవ్యయుగ ఆధ్యాత్మిక విభాగాన్ని, శాకాహార విశిష్టతను మరియు పిరమిడ్ శక్తి యొక్క అవగాహనను ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కలుగజేయడం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క లక్ష్యం. ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రపంచ వ్యాప్త నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవంలో భాగం. ఈ(…)
God Screenplay 0
by ramthamedia • spirituality • Tags: ఆశయాలు, కోరికలు, గాడ్, గాడ్ స్రీన్ ప్లే
Birth Rebirth is a Computer OS Install and Hard disk format 0
by ramthamedia • science, spirituality • Tags: birth and rebirth star wars, birth control rebirth full album, birth death rebirth, birth of isaac rebirth, birth rebirth, birth rebirth cycle, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం, పరమాత్మ, పునర్జన్మ, హార్డ్ డిస్క్
Birth Rebirth is a Computer OS Install and Hard disk format జన్మ- పునర్జన్మ- కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం,హార్డ్ డిస్క్. స్తబ్దంగా ఉన్న కొత్త కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టం ఉదాహరణకు విండోస్ 10.0 ఇన్ స్టాల్ చేయడమే మనిషి కొత్త జన్మ లాంటిది..కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం ఇక్కడ ఆ కంప్యూటర్ ప్రత్యేక ఆత్మ. Read below in Telugu pdf format
Enlightened Person List 0
by ramthamedia • spirituality • Tags: enlightened persons, enlightened persons in india, enlightened persons world, ఎన్ లైటెన్డ్ పర్సన్స్
enlightened person list Many of their names have been lost to eternity. This is but a short list of enlightened people and beings who have given gifts to the world . ఇది సంపూర్ణమైన ఎన్ లైటెన్డ్ పర్సన్స్ లిస్ట్ కాదు, కాని అవగాహన కోసం ఈ భూమి మీద జీవించిన, ప్రస్తుతం జీవించి ఉన్న కొంత మంది ప్రముఖల లిస్ట్ మాత్రమే..లిస్ట్ లో లేని కొన్ని వేల మంది ఇతర ఎన్(…)
సంకల్ప శక్తి- న్యూరాన్లు 0
by ramthamedia • science, spirituality
1)మనిషి అవసరాలు,కోరికలు అతన్ని కొత్త ప్రపంచంలోకి తోసివేసి,అక్కడ జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరుస్తాయి. 2)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది అణువుల అసంపూర్ణ బాహ్య కక్షల్లో ఎలక్ట్రాన్స్ మార్పిడి లాంటివే.(ఎలక్ట్రాన్స్ బాహ్య కక్షల్లో ఖాళిలు ఉంటేనే మరో అణువు ఎలక్ట్రాన్ దూరినట్టు, అవతలి వ్యక్తి,దేశమాన పరిస్థితుల మీద ఆదార పడి మాత్రమే సంకల్ప శక్తులు నెరవేరడం జరుగుతుంది) 3)వ్యక్తులమధ్య,వ్యవస్థమధ్య,దేశాలమధ్య ఉండే సంభందాలకు ఒకే సార్వత్రిక నియమం నీ కక్ష్యలో నాకు స్థానమిస్తే,నా కక్షలో నీకిస్తాననే. 4)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది(…)
మాష్టర్ సి.వి.వి గారి రాజయోగ 0
by ramthamedia • spirituality • Tags: మాష్టర్ సి.వి.వి గారి రాజయోగ
మాష్టర్ సి.వి.వి గారి రాజయోగ 1910లో దిగివచ్చిన కుంభచైతన్యమునుఅందుకొని విశ్వప్రణాళికలో భాగంగా మానవజాతిని దైవసామ్రాజ్యములోనికి నడిపించుటకువచ్చిన పరబ్రహ్మ స్వరూపులు మాస్టరు సి.వి.వి గారు.“కుంభకోణము” అను పట్టణమున “కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు” అను నామధేయముతో మాస్టర్ సి. వి. వి. గారు 1868 వ సంవత్సరము ఆగష్టు 4 వ తేదీన అవతారమూర్తిగా ఉదయించారు. ప్రార్థన: ప్రతిరోజూ క్రమము తప్పకుండా ఉదయం, సాయంత్రం 6గంటల సమయానికి శరీరం, మనసుశుచిగా వుంచుకొని, మాస్టరుగారి చిత్రపటాన్ని ఉత్తర ముఖముగానో, తూర్పుముఖముగానో వుంచి, అగరువత్తులు, దీపం వెలిగించి, సుఖము, స్థిరము అయిన ఆసనంఏర్పరుచుకొని కూర్చోవాలి. హృదయంలోనో, భ్రూమద్యంలోనో మాస్టరుగారిని మానసికంగాదర్శించి, నమస్కారం చేస్తూ “మాస్టర్ సి.వి.వి నమస్కారం” (Master C.V.V. Namaskaram) అని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినపుడు మాస్టరుగారు(పద్మాసనాసీనులై యున్నవారు) తన దక్షిణ (కుడి) హస్తంతో మనలను ఆశీర్వదిస్తున్నట్లు,యోగమారంభించ మంటున్నట్లు, తాను పని ప్రారంభిస్తున్నట్లు, మనము సాక్షీభూతముగామన దేహ కోశములందు జరుగు మార్పు లను చూస్తున్నట్లు భావించాలి. మార్పులుజరుగుతున్నత సేపు కనులు తెరుచుకోవు. ఆ రోజుకు వర్కింగ్స్ (workings) పూర్తి అయినతరువాత కనులు తెరుచుకుంటయి. ఏ రోజున ఎంతవరకు జరిగితే శ్రేయస్సో, అంతవరకేమాస్టరుగారు మార్పులు (వర్కింగ్స్) జరుపుతారు. ఎప్పుడు చేయాలి: ఇక్కడ మనకు ఒక అనుమానము రావచ్చును. 6 గంటలకే ఎందుకు చెయ్యాలి. మొదట4-8 గంటల మధ్యలో చేసుకొనమని చెప్పిననూ చివరకు 6 గంటలకు స్థిరపరిచారు. 6ఎందుకో చూద్దాం.. సృష్టిలో చతుర్వ్యూహములతో వ్యక్తమయ్యే దైవము రోజులో నాలుగు ముఖ్యమైనభాగములను ఏర్పరుస్తాడు. ఒకటి పూర్తి చీకటి (అర్థరాత్రి), ఇంకొకటి పూర్తి వెలుగు(మధ్యాహ్నము). మిగిలినవి సంధ్యలు. అప్పుడు వెలుగు చీకటులు సమముగావుంటాయి. అవి రాత్రి 12 గం. పగలు 12 గం. ఉదయము, సాయంత్రము 6 గం. రాత్రిసమయము నిద్ర, పగటి సమయము దేహ పోషణమునకు కావలసిన దాని సంపాదన. మిగిలిన సంధ్యా సమయములు దైవ ప్రార్థనకు అనుకూలమైన సమయాలు. సాయంకాలము కంటే ఉదయము ముఖ్యమైనది. ఎందుకంటే నిద్రలేచిన వెంటనే మనస్సుప్రశాంతముగా ఎటువంటి కలతలు లేక ఒకవిథమైన నిశ్చలతను పొంది వుంటుంది కనుకఅటువంటి మనస్సుతో చేసిన ప్రార్థన మనలను త్వరగా మాస్టరుగారి సన్నిధికి చేరుస్తుంది. అలాకాక నిద్రలేచిన తరువాత, కొన్ని సేపు గడచిన తరువాత, వారితో వీరితో అవి, ఇవిమాట్లాడి, పేపరు చూసి, తీరుబడిగా ప్రార్థనకు వెళ్ళిన మనస్సు ప్రశాంతత కోల్పోయికలుషితమై వుంటుంది కనుక ప్రార్థన యొక్క ముఖ్య ఆవశ్యకతను పొందుటకు వీలుకలుగదు. ఉదయము 6 గం.లకు చేసిన ప్రార్థన వల్ల కలిగినంత ప్రశాంతత సాయంకాలపుప్రార్థన ఇవ్వదు. ఆ రోజు కార్యక్రమముల మద్య నలిగిన మనస్సే కారణము. ప్రతిరోజుఒకేపని ఒకే సమయానికి క్రమము తప్పకుండా శ్రద్దతో చేసిన అది మనలో కావలసినసమస్త మార్పులను అందిస్తుంది. మనలోని అయస్కాంతత్వమును పెంచుతుంది. అటువంటి శిష్యుని గురువు దగ్గరికి చేర్చుకుంటాడు. 6 గం.ల సమయానికి ఎవరైనా తన కర్తవ్య నిర్వహణలో వున్నచో వారు ఎక్కడ వుంటేఅక్కడనే మనస్సులో మాస్టరుగారికి నమస్కారము చేసుకొని తరువాత వీలువెంట ప్రార్థనచేసుకొన వచ్చును. కర్తవ్యమంటే శ్రీకృష్ణుడు చెప్పిన కర్తవ్యమే. సినిమాకి వెళ్ళాం, క్రికెట్వస్తోంది, స్నేహితులు వచ్చారు… ఇలాంటివి కాదు. అంతే కాని ఉదయము నిద్ర లేవటముకష్టముగా వున్నది కనుక మనకు నచ్చిన సమయానికి ప్రార్థన చేసినచో అది మాస్టరుగారికిఇష్టము వుండదు. అది ఆయన మెచ్చరు అని గుర్తివుంచుకోవాలి. గురువు చెప్పినట్లుశిష్యుడు ఆచరించాలి, అంతే కాని శిష్యుడు చెప్పినట్లు గురువు అనుగ్రహించడు. ఎంతసేపు చేయాలి: మాస్టరుగారు నిర్దేశించిన సమయము 15 ని.లు. కాని ఒకవేళ మాస్టరుగారు మనలోకావలసిన మార్పులు చేయుచున్నచో అప్పుడు ఎంత సేపు అయినా గడవవచ్చును. అదిఆయన ఇష్టము. కనుక ప్రార్థన ఇంతసేపే అనే భావన లేకుండా ప్రార్థనలో కూర్చోవాలి. కొన్ని సార్లు 15, 20, 30, 40 లేక ఒక గంట అయినా అవవచ్చు. మనకి కన్నులు తెరవాలిఅని అనిపించదు. కేవలము ఇంతసేపు అనే భావన వున్నచో సమయము లెక్కించటమేఅవుతుంది. కనుక ఎంతసేపు అన్న భావన వద్దు. సమర్పణ: “మాస్టరుగారు..నేను, నా స్వభావము, దేహము, మనస్సు, బుద్ది, ఇంద్రియమలు,అహంకారములతో మీ పాదముల చెంత సమర్పణ చెందుచున్నాను. వాటియందుకావలసిన మార్పులను అనుగ్రహించి సమస్త కోశములను పరిశుద్ది గావించండి. నాలోనిభావములను, కోరికలను ధర్మయుక్తము చేయండి. కామమును తగ్గించి ప్రాణముకుపెంపొందించండి. సూక్ష్మదేహ నిర్మాణము చేసి అమరత్వమును ప్రసాదించండి. మీ దివ్యప్రణాళికలో నాకునూ కర్తవ్యన్ని, బాధ్యతను ఏర్పరచండి. నన్ను పరహితమునకుఅంకితము చేయండి. నేను మీకు సదా వాహికనై వుండునట్లు అనుగ్రహించండి. సృష్టిలోనిసమస్త జీవరాశులు సంతోషముగా, ఆరోగ్యముగా, ఆనందముగా వుండేటట్లుఅనుగ్రహించండి” అని ప్రార్థించి అయన చెప్పినట్లు లోతట్టున జరుగుతున్న మార్పులనుగమనించాలి. క్రమము తప్పని ప్రార్థన, ఇతరుల నుండి ఏమియు ఆశించకుండా ఉండటము,ఫలితమాసించని సేవ చాలా ముఖ్యము. అలా తనకు సమర్పణ చెందినవారిని తనంతటివారుగా చేస్తాను అని మాస్టరుగారి వాగ్దానము. మనకు కలిగిన సమస్త కోరికలను ఆయనకేసమర్పించినచో మనకి ఏది శ్రేయస్సో దానిని ఆయన అనుగ్రహిస్తారు. అప్పుడు జీవితముఆనందమయము అవుతుంది. అనవసరపు కోరికలు కలుగవు. సర్వ కాల సర్వావస్థలయందు ఆయన రక్షణ, శిక్షణ మనకు అందుతాయి. మరణము లేని స్థితికి చేరుతాము. అంటే శరీరము లేకున్ననూ జీవించి వుండే స్థితి. చింతామణి వంటి మాస్టరు గారు మనచెంత వుండగా చింతలేల. ఆయనను స్మరిద్దాం, శరణువేడుదాం ఆయన చెప్పినట్లు ప్రార్థనచేద్దాం. మాస్టరు సి.వి.వి గారి పాద పద్మములకు నమస్కారము. దిగువన పి.డి.ఎఫ్ ఫార్మెట్ లో చదవండి.
ఆధ్యాత్మిక సంస్థలు- నిజా నిజాలు 0
by ramthamedia • spirituality • Tags: ఆధ్యాత్మిక సంస్థలు నిజాలు
ఆధ్యాత్మిక సంస్థలు- నిజా నిజాలు 1) నూటికి 99 శాతం సంస్థలు , భక్తులు, ఫాలోవర్స్ ఇచ్చే చందాల మీద నడిచేవే.. 2.) మనిషికి వచ్చే రోగం ,నొప్పులు,మానసిక, ఆర్ధిక భాధలలకు అయా రంగాల్లో డబ్బులు తీసుకుని ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్స్, జ్యోతిష్యుల, మానసికి రోగ నిపుణులు ఉన్నారు. 3. ) వీటన్నింటికి మించింది ఆధ్మాత్మిక భయం.. మనం ఎక్కడి నుండి వచ్చామా, చచ్చాక ఎక్కడికి పోతున్నామో, జీవితానికి అర్ధం ఏమిటో అర్థం కాని సమస్యలతో(…)
Recent Comments